నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జయహో జనార్ధన’. పానుగంటి శరత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎం శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా మ్యూజిక్ అందించింది చరణ్ అర్జున్.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ విజనరీ డైరెక్టర్ సంపత్ నంది గారి చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి గారు.పోస్టర్ లాంచ్ తర్వాత సంపత్ నంది గారు మాట్లాడుతూ ..నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి ని మరియు మూవీ టీం ని అభినందించి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


