‘మా ఏంజిల్‌ ఈరోజే ఈ లోకంలోకి వచ్చింది’ | Sameera Reddy Welcomed A Baby Girl | Sakshi
Sakshi News home page

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి

Jul 12 2019 8:48 PM | Updated on Jul 12 2019 8:52 PM

Sameera Reddy Welcomed A Baby Girl - Sakshi

నటి సమీరా రెడ్డి ఈ రోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు సమీరా రెడ్డి. కుమార్తె చేయి పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సమీరా. ‘ఈ రోజు ఉదయం మా లిటిల్‌ ఏంజెల్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీరు చూపిన ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సమీరాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అని కామెంట్లు చేశారు.
 

సమీరా ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జై చిరంజీవ’, ‘అశోక్‌’ చిత్రాల్లో నటించారు.  2014లో అక్షయ్‌ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. 2015లో ఈ దంపతులకు కుమారుడు హాన్స్‌ జన్మించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement