నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు : సమీరా రెడ్డి

Sameera Reddy Said Industry Expecting More From Women - Sakshi

ఇండస్ట్రీలో మహిళల నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంటారు. ఈ ఆలోచన ధోరణి మారాలి అంటున్నారు నటి సమీరా రెడ్డి. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడారు సమీరా రెడ్డి. ‘అవకాశాలను ఎరగా చూపి మహిళల్ని వాడుకోవాలనుకుంటారు. అనేక రకాలుగా ఇ‍బ్బంది పెడుతుంటారు. మహిళ అంటే కేవలం ఓ గ్లామర్‌ వస్తువుగా మాత్రమే చూస్తారు. నేను కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అన్నారు సమీరా.

అంతేకాక ‘పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరు. పారితోషికం విషయంలో మాత్రమే కాదు గౌరవం విషయంలో కూడా ఈ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల విషయంలో పరిశ్రమ ఆలోచన పూర్తిగా మారాలి. ఈ మార్పు ఎంత త్వరగా వస్తే అంత మేలు జరుగుతుంది. మీటూ లాంటి ఉద్యమాల వల్ల ఇప్పుడిప్పుడే ఆ మార్పు ప్రారంభమయ్యింది. అయితే ఇంకా బుల్లి బుల్లి అడుగులే పడుతున్నాయి. కాస్త త్వరగా మార్పు వస్తే మంచిద’న్నారు సమీరా.

2014 వరకు సమీరారెడ్డి దక్షిణాది సినిమా పరిశ్రమలో రాణించింది. ఆ తర్వాత పారిశ్రామిక వేత్త అక్షయ్ వార్దేను వివాహం చేసుకోవడంతో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారు. 2015 నుంచి కేవలం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top