
అతడితో డాన్స్ అంటే భయం: సమంత
అందాలతార సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నాతో మాట్లాడొచ్చు అంటూ ముందే ట్వీట్ చేసిన సమంతా.. అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
అందాలతార సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో తనతో మాట్లాడొచ్చని ముందే ట్వీట్ చేసిన సమంతా.. అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సమంతగా ఉన్నందుకు మీరు పొందిన అతి పెద్ద అడ్వాంటేజ్ ఏదంటూ అడిగిన ప్రశ్నకు.. ఆర్మీలాంటి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు.
మరి కొన్ని ప్రశ్నలు మీకోసం..
-తమిళనాడు ఎన్నికలపై మీ అభిప్రాయం ?
ఓటు హక్కును వినియోగించుకోండి. ఇతరుల నిర్ణయానికి కట్టుబడకండి.
-మళయాళం సినిమాకి ఓకే చెబితే.. అక్కడ ఎవరితో జతకట్టేందుకు ఇష్టపడతారు ?
దుల్కర్ సల్మాన్
-జీవితంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ?
సినిమాల తర్వాత జీవితంలో కూడా విజయం సాధించాలనుకుంటున్నాను.
-ప్రయాణాల్లో మర్చిపోవడానికి భయపడే మూడు వస్తువులు ?
చర్మ సంరక్షణకు సంబంధించినవి, మందులు, మంచి లోదుస్తులు
-మీ అభిమాన నటుడు ?
ప్రస్తుతానికి యెడ్డీ రెడ్మేన్
-జీవితంలో ఏది లేకపోతే అస్సలు బతకలేనని మీ ఫీలింగ్ ?
చాలెంజ్
-మహేష్ కూతురు సితారతో మీరేం మాట్లాడారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది..
తన నెయిల్ పాలిష్ గురించి..
-మీ జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలు ?
ప్రస్తుతం నేను జీవిస్తున్నవే..
-మిమ్మల్ని ఎక్కువగా అడిగి చిరాకు పెట్టే ప్రశ్న ?
షూటింగ్ స్పాట్లో జరిగిన ఓ సంఘటనను చెప్పండి అని... ఆ ప్రశ్నకు అంత ఇరిటేషన్ ఎందుకు వస్తుందో నాక్కూడా తెలీదు.
-ప్రపంచంలో మీ ఫేవరెట్ ప్లేస్ ?
ఇంటికి మించిన ఫేవరేట్ ప్లేస్ లేదు
-మీ ఫేవరేట్ ఫుడ్ ?
జపనీస్
-చిన్మయి కాకుండా ఎవరి వాయిస్ మీకు సరిపోతుందని భావిస్తున్నారు ?
నా సొంత గొంతే..
-ఎవరితో డ్యాన్స్ చేయాలంటే భయపడతారు ?
జూనియర్ ఎన్టీఆర్
-మీ ఊతపదం ?
పాపా..
-కష్ట సమయాలను ఎలా ఎదుర్కొంటారు ?
ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను
-నటనకు దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ?
వంట చేయడం నేర్చుకుంటాను
-మీ విజయ రహస్యం ?
రహస్యాలేమీ లేవు.. కష్టపడటమే.
-ఇండస్ట్రీలో ఎవరిని మీరు కాంపిటీషన్ గా భావిస్తున్నారు ?
కాంపిటీషన్ ఉండటం ఇష్టమే, చాలా స్ఫూర్తినిస్తుంది.. అయితే కాంపిటీటర్స్ మారిపోతుంటారు.
-మీకు చాలా భయమనిపించేది ఏది ?
ఎక్కడ మొదలయ్యానో మళ్లీ తిరిగి అక్కడికి.. వెనక్కి వెళ్లడమంటే చాలా భయం
-మీకు సంబంధించి మూడు బ్యూటీ టిప్స్ ?
నైట్ క్రీమ్, విటమిన్స్, సన్ స్క్రీన్