ఎన్టీఆర్ అభిమానులకు సర్ప్రైజ్..? | Samantha Special Role in Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ అభిమానులకు సర్ప్రైజ్..?

Apr 1 2017 11:31 AM | Updated on Sep 5 2017 7:41 AM

ఎన్టీఆర్ అభిమానులకు సర్ప్రైజ్..?

ఎన్టీఆర్ అభిమానులకు సర్ప్రైజ్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బిగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బిగ్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై బిగ్ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అభిమానులకు మరో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్తో ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత, జై లవ కుశలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. నాగచైతన్యతో పెళ్లి వార్తల తరువాత సినిమాల విషయంలో సెలెక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటి ప్రస్తుతం రాజుగారి గది 2 తో పాటు రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement