సమంత ప్రెగ్నెన్సీ.. హ..హ.. హ...

Samantha Akkineni on Pregnancy Rumours - Sakshi

సౌత్‌ బేబీ డాల్‌ సమంత అక్కినేని ఇంటి కోడలిగా మారి ఆరు నెలలపైగానే గడుస్తోంది. ఓవైపు చైతూతో పర్సనల్‌ లైఫ్‌.. మరోవైపు సినీ కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమె గర్భం దాల్చిందంటూ కొన్ని వెబ్‌ సైట్‌లలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై సమంత ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో స్పందించారు.

‘ఆ కథనాలు నాకు నవ్వు తెప్పించాయి. నేను-చైతూ పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం.’ అని సామ్‌ తెలిపింది. ఇక పిల్లల్ని కన్న తర్వాత సినిమాలు చేస్తారా? అన్న మరో ప్రశ్నకు.. ‘ఒక్కసారి నేను తల్లిగా మారితే.. ఇక నాకు పిల్లలే ప్రపంచం’ అంటూ పరోక్షంగా సినిమాలకు పుల్‌ స్టాప్‌ పెడతానంటూ సంకేతాలిచ్చేశారు.

ఇక పెళ్లికి ముందు కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకునే దానినన్న సమంత.. పెళ్లయ్యాక కుటుంబం గురించి కూడా ఆలోచించాల్సి వస్తోందంటూ.. తాను గమనించిన తేడాలను ఆమె వివరించారు. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న సామ్‌.. త్వరలో మహానటితో పలకరించబోతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top