సల్మాన్‌ సర్కస్‌ | Salman Khan Workouts for Bharat | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ సర్కస్‌

Aug 5 2018 6:04 AM | Updated on Aug 5 2018 6:04 AM

Salman Khan Workouts for Bharat - Sakshi

సల్మాన్‌ఖాన్‌

పెళ్లి కోసం సల్మాన్‌ఖాన్‌ ఫీట్స్‌ వర్కౌట్‌ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ ‘భారత్‌’ సినిమా కోసం స్టేజ్‌పై ఆయన బాగానే ఫీట్స్‌ చేస్తున్నారు. తాడు పట్టుకుని గాల్లో ఊగుతున్నాడు. కుర్చీలతో అద్భుతమైన ఫీట్స్‌ చేస్తున్నాడు. స్టేజ్‌పై బైక్‌ను గింగిరాలు తిప్పుతున్నాడు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘భారత్‌’. ఇందులో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటించనున్నారు. దిశా పాట్నీ ఓ కీ రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్, దిశా సర్కస్‌ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ఇంట్రో సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోందని సమాచారం. ఈ సాంగ్‌లో దిశా పాట్నీ కూడా పాల్గొంటున్నారు. ఈ సాంగ్‌ కోసం దాదాపు ఐదు వందలమంది బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్స్‌ను పిలిపించారట టీమ్‌. అంటే సల్మాన్‌ సర్కస్‌ కమ్‌ సాహసాలతో సాగే ఈ సాంగ్‌ ఐఫీస్ట్‌గా ఉంటుందట.

Advertisement
 
Advertisement
Advertisement