వైరల్‌ వీడియో; సల్మాన్‌ క్రేజ్‌ ఇంతేనా..! | Salman Khan Spotted At A Dubai Mall But No One Identify Him | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో; సల్మాన్‌ క్రేజ్‌ ఇంతేనా..!

Jul 18 2018 3:00 PM | Updated on Jul 18 2018 3:12 PM

Salman Khan Spotted At A Dubai Mall But No One Identify Him - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

చిన్న సినిమా నటులు, బుల్లితెర నటులు కనిపిస్తేనే జనాలు ఎగబడి పోతుంటారు. సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం తన్నుకుంటూ అటు వారికి, ఇటూ జనాలకు ఇబ్బంది కల్గిస్తుంటారు. అదే బడా హీరోలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం తమిళ్‌ హీరో సూర్యకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అభిమానుల తాకిడికి తట్టుకోలేక పాపం సూర్య ఏకంగా గోడ దూకాల్సి వచ్చింది. ఇది ఇక్కడ మనదేశంలో పరిస్థితి. మరి మన స్టార్‌ హీరోలు విదేశాల్లో కూడా స్టార్‌లేనా..? విదేశాలకు వెళ్లినప్పుడు మన హీరోల పరిస్థితి ఎలా ఉంటుంది...? ఇదిగే ఇలా ఉంటుంది అంటున్నారు అభిమానులు.

ఈ మధ్య బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ దుబాయ్ వెళ్లారు. కానీ అక్కడ సల్మాన్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంటే సల్లుభాయ్‌ను ఎవరూ గుర్తు పట్టలేదు. సల్మాన్‌ ఓ సాధరణ పౌరుడిలాగా మాల్‌ అంతా తిరుగుతూ ఓ చోట వెళ్లి కూర్చున్నారు. కానీ ఇక్కడ ఇండియాలో లాగా ఎవరూ ఆటోగ్రాఫ్‌, ఫోటోగ్రాఫ్‌ అంటూ వెంట పడలేదు. సల్మాన్‌ వచ్చినట్లు గమనించిన ఓ అభిమాని  దీన్నంతా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ వైరల్‌గా మారింది.

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ అబ్బాస్‌ అలీ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు

Advertisement
 
Advertisement
Advertisement