జస్ట్ రిలాక్స్! | Salman Khan, Kangna ranautlu Just Relax | Sakshi
Sakshi News home page

జస్ట్ రిలాక్స్!

Jun 3 2015 10:44 PM | Updated on Sep 3 2017 3:10 AM

జస్ట్ రిలాక్స్!

జస్ట్ రిలాక్స్!

బాలీవుడ్ నాయకానాయికలు సల్మాన్‌ఖాన్, కంగనా రనౌత్‌లు జస్ట్ రిలాక్స్ అనే మంత్రం జపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా షూటింగ్స్‌తోను,

బాలీవుడ్ నాయకానాయికలు సల్మాన్‌ఖాన్, కంగనా రనౌత్‌లు జస్ట్ రిలాక్స్ అనే మంత్రం జపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా షూటింగ్స్‌తోను, వ్యక్తిగత వ్యవహారాలతోనూ ఉక్కిరిబిక్కిరి అయిన ఈ ఇద్దరూ సేద తీరాలనుకున్నారు. సల్మాన్ ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. కంగనా మాత్రం రిలాక్స్ కావడానికి ఇంటికన్నా మిన్న ఏముంది అనుకున్నారో ఏమో. తన సొంత ఊరు హిమాచల్ ప్రదేశ్ వెళ్లిపోయారు. అక్కడికైతే అతిథుల రాకపోకలు ఉండవు. ఎంచక్కా సేద తీరొచ్చని అనుకున్నారు. ఇక, సల్మాన్ అయితే ఫామ్‌హౌస్‌లోకి ఇతరులకు ప్రవేశం లేదనే టైప్‌లో వ్యవహరిస్తున్నారట. ఎవరొచ్చినా అనుమతించవద్దని తన సిబ్బంది దగ్గర పేర్కొన్నారట. సల్మాన్, కంగనా ఈ రేంజ్‌లో రిలాక్స్ అవుతున్నారంటే.. షూటింగ్స్ ఒత్తిడి వాళ్ల మీద ఎంత ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement