ఫైవ్‌ స్టార్లం మేమే | Salman Khan feels these 5 actors including him are only stars in Bollywood | Sakshi
Sakshi News home page

ఫైవ్‌ స్టార్లం మేమే

Jul 13 2019 6:57 PM | Updated on Jul 13 2019 8:26 PM

Salman Khan feels these 5 actors including him are only stars in Bollywood - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (53) సంచలన వ్యాఖ్యలు చేశారు. దబాంగ్ ‌3 మూవీ షూటింగ్‌లో  బిజిగా ఉన్న బాలీవుడ్‌ బాడీగార్డ్‌  తన స్టార్‌డమ్‌ గురించి మరోసారి  గొప్పగా చెప్పుకున్నాడు.  అంతేకాదు బాలీవుడ్‌లో తనతోపాటు  కేవలం అయిదుగురు  మాత్రమే సూపర్‌ స్టార్లుగా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు.

 ఒక ఇంటర్వ్యూలో సల్మాన్‌ మాట్లాడుతూ.. స్టార్‌డమ్‌ ఎప్పటికైనా ఫేడ్‌ ఔట్‌ అవ్వక తప్పదు.  సుదీర్ఘ కాలం కరియర్‌ను  కొనసాగించడం  చాలా కష్టం. కానీ  తనతోపాటు షారూఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌ మాత్రమే  ఇప్పటికీ బాలీవుడ్‌లో స్టార్లుగా కొనసాగుతున్నామని అభిప్రాయపడ్డారు.  ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అయితే అందరు సూపర్ స్టార్ల మాదిరిగానే,  మా బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా ఎనిమిది నుండి పది శాతానికి తగ్గొచ్చు.  కానీ  ఆ డౌన్‌ ట్రెండ్‌ ఇంకా ప్రారంభం కాలేదని సల్మాన్‌ వ్యాఖ్యానించారు.

కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దబాంగ్‌ 3లో  తన ఐకానిక్‌ పోలీస్‌ పాత్ర చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌​ అలరించనున్నారు.  సోనాక్షి సిన్హా, డింపుల్‌ కపాడియా, అర్బాజ్‌ ఖాన్‌, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీంతోపాటు దాదాపు 19 సంవత్సరాల తరువాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘ఇన్షాల్లాహ్‌’  మూవీలో అలియా భట్‌తో సల్మాన​  రొమాన్స్‌ చేయనున్న సంగతి  తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement