మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ! | Saif Ali Khan daughter, Shahid Kapoor brother to debut in SOTY2 | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

Mar 29 2016 4:59 PM | Updated on Sep 3 2017 8:49 PM

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది.

బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు.

అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement