
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఓ సస్పెన్స్ ఎలిమెంట్‌తో రూపొందిన సినిమా ఇది.
ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పాత్రలో రకుల్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇక కార్తీక్ ఆర్యన్ హీరోగా, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన సక్సెస్‌ఫుల్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘పతీ పత్నీ ఔర్ వో దో’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.