మూడు కోట్ల సెట్‌లో... | Sai Srinivas, rakulprit Singh new song in their new movie | Sakshi
Sakshi News home page

మూడు కోట్ల సెట్‌లో...

Dec 30 2016 11:55 PM | Updated on Aug 3 2019 1:14 PM

మూడు కోట్ల సెట్‌లో... - Sakshi

మూడు కోట్ల సెట్‌లో...

మ... మ... మాస్‌! ఊర మాస్‌! సినిమాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను పేరు చెబితే భారీతనమే గుర్తొస్తుంది.

మ... మ... మాస్‌! ఊర మాస్‌! సినిమాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను పేరు చెబితే భారీతనమే గుర్తొస్తుంది. పాటైనా... ఫైటైనా.. ఏదైనా బోయపాటి సినిమాల్లో భారీతనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటివరకూ స్టార్‌ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు యంగ్‌స్టర్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిస్తున్న సినిమాను సైతం గత సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిస్తున్నారు. గురువారం వరకూ అన్నపూర్ణా స్టూడియోస్‌లో హీరో హీరోయిన్లు సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లపై ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఓ పాటను చిత్రీకరించారు.

సెట్‌లో సాంగ్‌ తీయడంలో పెద్ద వింతేముంది? అనుకుంటున్నారా! అక్కడే అసలు మేటర్‌ ఉంది. సెట్‌ అంటే అల్లాటప్పా సెట్‌ కాదు, అక్షరాలా మూడు కోట్ల రూపాయలతో ఆ సెట్‌ వేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఎలాగో అదిరే బీట్‌ అందించుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, తమిళ నటుడు శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజ్ఞా జైస్వాల్‌ మరో హీరోయిన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement