స్టార్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్..! | Sai Dharam tej Movie with vv vinayak | Sakshi
Sakshi News home page

స్టార్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్..!

Jun 3 2017 10:02 AM | Updated on Sep 5 2017 12:44 PM

స్టార్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్..!

స్టార్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్..!

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. మెగా ఇమేజ్ ను

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. మెగా ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటూ తనకంటూ మార్కెట్ సంపాదించుకున్న సాయి, ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డాడు. తిక్క, విన్నర్ సినిమాలు సాయి మార్కెట్ మీద గట్టినే ప్రభావం చూపించాయి. అయితే ఆ కష్టాల నుంచి బయటపడి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడీ మెగా హీరో.

ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్. రైటర్ కమ్ డైరెక్టర్ బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో ఓ స్టార్ డైరెక్టర్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి హీరోగా వంద కోట్ల హిట్ అందుకున్న వివి వినాయక్ తో నెక్ట్స్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకు స్టార్ రైటర్ కోనా వెంకట్ కథ అందింస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement