ఆమె చెప్పిన ఓ మంచి మాట! | sahoo teaser release on prabas birthday | Sakshi
Sakshi News home page

ఆమె చెప్పిన ఓ మంచి మాట!

Oct 18 2017 3:28 AM | Updated on Jul 17 2019 10:14 AM

sahoo teaser release on prabas birthday - Sakshi

తమిళసినిమా: సినిమా వాళ్లు ఎప్పుడూ తమ గురించే మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి ముఖ్యంగా అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఓ మంచి మాట చెబుదాం అనే ఆలోచన రాదు. ఎందుకంటే సెలబ్రిటీలైన వారి మాటలైనా, చేష్టలైనా సాధారణ ప్రజలపై చాలా ప్రభావం చూపుతాయన్నది నిజం. అలా నటి శ్రద్ధాకపూర్‌ ప్రజలకు ఓ మంచి మాట చెప్పారు. పలు హిందీ చిత్రాల్లో నటించి పాపులర్‌ అయిన ఈ ముద్దుగుమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రద్ధాకపూర్‌లో మంచి నటితో పాటు, గాయని, గీతరచయిత ఉన్నారు. ఈ బ్యూటీ పలు చిత్రాలకు పాడారు. పాటలు రాశారు. సాహో చిత్రంతో టాలీవుడ్, కోలీవుడ్‌లకు పరిచయం కానున్నారు. బాహుబలి సీరిస్‌ తరువాత నటుడు ప్రభాష్‌ నటిస్తున్న త్రిభాషా చిత్రం సాహో.

భారీ ఎత్తున్న తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న సాహో చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. శద్ధాకపూర్‌ ఆదివారం తన ట్విట్టర్‌ ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోండి. అయితే పటాసులు కాల్చి భూమండలాన్ని పొగమండలంగా మాత్రం మార్చకండి. అది అందరి ప్రాణాలకు చెడు కలిగిస్తుంది అంటూ ఒక మంచి మాటతో హితవుపలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement