ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ | Shraddha Kapoor Becomes India Most Popular Female On Instagram | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ, ప్రియాంక చోప్రాను అధిగమించిన శ్రద్ధా కపూర్

Aug 24 2024 9:08 PM | Updated on Aug 24 2024 9:31 PM

Shraddha Kapoor Becomes India Most Popular Female On Instagram

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం  స్త్రీ 2 విజయంతో భారీగా అభిమానులను పెంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్న హీరోయిన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా  పాపులారిటీలో ప్రధాని మోదీనే వెనక్కి నెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రియాంక చోప్రాను కూడా వెనక్కు నెట్టి టాప్‌ ప్లేస్‌లో చేరిపోయారు.

బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను కట్టిపడేస్తుంది. తన దినచర్యతో పలు విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అలా భారీ సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అభిమానులకు సంపాదించుకుంది. ఆమెకు ప్రస్తుతం  91.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండియన్‌ హీరోయిన్‌ల పాపులారిటీలో  ఆమె టాప్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. ఇండియన్‌ అందరి సెలబ్రిటీల జాబితాలో అయితే రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాలోని ప్రముఖల జాబితాలో శ్రద్ధా కపూర్‌ టాప్‌-4 లో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు

  • ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో - 636 మిలియన్లు 

  • లియోనెల్ మెస్సీ- 504 మిలియన్లు

  • క్రికెటర్ విరాట్ కోహ్లీ - 270 మిలియన్లు

  • శ్రద్ధా కపూర్ - 91.9 మిలియన్లు 

  • ప్రియాంక చోప్రా - 91.8 మిలియన్లు

  • ప్రధాని నరేంద్ర మోదీ - 91.3 మిలియన్లు 

  • అలియా భట్ - 85.1 మిలియన్లు.

  • కత్రినా కైఫ్ - 80.4 మిలియన్లు.

  • దీపికా పదుకొనే - 79.8 మిలియన్లు.

Advertisement
 
Advertisement
Advertisement