రజనీకాంత్‌ ఇంట్లో విషాదం | Sad Incident In Rajinikanth home | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ఇంట్లో విషాదం

Sep 4 2018 10:40 AM | Updated on Sep 4 2018 4:06 PM

Sad Incident In Rajinikanth home - Sakshi

రజనీకాంత్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు.

చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌ అన్నయ్య సత్యనారాణన్‌ భార్య కళావతిబాయి (70) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూర్‌లో కన్నుమూశారు. ఆమె అంతిమ చూపు కోసం రజనీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో సహా సోమవారం ఉదయం బెంగళూర్‌ వెళ్లారు. రజనీకాంత్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు. రజనీకాంత్‌ను చెన్నైకి పంపి, నటుడయ్యే వరకూ ఆయన బాగోగులు అన్నయ్య వదినలే చూసుకున్నారు.

ఇదిలాఉండగా రజనీకాంత్‌ వదిన కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం ఫలించక ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కళావతిబాయి మరరణ వార్త విన్న రజనీకాంత్‌ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా విమానం ద్వారా బెంగళూర్‌ వెళ్లారు. కళావతిబాయికి సోమవారం సాయంత్రం బెంగళూర్‌లో అంత్యక్రియలు జరిగాయి.

1
1/1

కళావతిబాయి (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement