‘జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు’ | Sachin Shroff Blames His Ex-Wife Juhi Parmar For Divorce | Sakshi
Sakshi News home page

‘జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు’

Jul 17 2018 8:42 PM | Updated on Apr 3 2019 6:34 PM

Sachin Shroff Blames His Ex-Wife Juhi Parmar For Divorce - Sakshi

సాక్షి, ముంబై : గత నెలలో విడాకులు తీసుకున్న బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ సచిన్‌ ష్రాఫ్‌, జూహి పర్మార్‌ ప్రస్తుతం పరస్పరం విమర్శల దాడికి దిగుతున్నారు. ‘మా బ్యాగ్రౌండ్‌, ఆలోచనా విధానం, అభిరుచులు... ఇలా వేటిలో కూడా పొంతన కుదరలేదు. ఈ బంధం ఎక్కువ కాలం నిలవదని వివాహం జరిగిన మొదటి రోజే నాకు అర్థమైంది. సర్దుకుపోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. నిజాయితీగా వ్యవహరించే వాళ్లకి చేదు అనుభవాలే మిగులుతాయని అర్ధమైందంటూ’ జూహి ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్తపై ఆరోపణలు చేసింది.

తాజాగా బాంబే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ ష్రాఫ్‌ తన మాజీ భార్యపై విమర్శలు గుప్పించాడు. ‘ఒక బంధం నిలవాలంటే ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. కానీ జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు. నేనేం చేసినా ఆమెకు నచ్చేది కాదు. ప్రేమ లేని పెళ్లికి అసలు అర్థమే ఉండదు కదా. అందుకే విడాకులకు ఒప్పుకున్నాను. నా కూతురి కోసం నా ఆస్తిలో సగం వాటా కూడా రాసిచ్చాను’  అంటూ సచిన్‌ పేర్కొన్నాడు.

2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట గత డిసెంబర్‌లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది విడాకులు మంజూరయ్యాయి. వీరికి సమైరా అనే కూతురు ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరైన అనంతరం పాప తల్లి వద్దే ఉంటోంది. అయితే ఆమె పోషణా భారాన్ని తండ్రి భరించాల్సి ఉంటుందన్న ఆదేశాల మేరకు సచిన్‌ తన ఆస్తిలో సగ భాగాన్ని కూతురి పేరిట రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement