పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం | Saakshyam Teaser Release | Sakshi
Sakshi News home page

పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం

Apr 21 2018 1:08 AM | Updated on Aug 22 2019 9:35 AM

Saakshyam Teaser Release - Sakshi

బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే

‘కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నెక్ట్స్‌ ఏం జరుగుతుంది?’ అనే అంశాల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సాక్ష్యం’. బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం... కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్న డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. అభిషేక్‌ నామా మాట్లాడుతూ–‘‘ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌గా ఉన్నాయి.

స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ హైలైట్‌. ప్రస్తుతం న్యూయార్క్, గ్రాండ్‌ కెన్యాన్, న్యూ జెర్సీలోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతోంది. హర్షవర్ధన్‌ మంచి సంగీతం అందిస్తున్నారు. మేలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, ‘వెన్నెల’ కిషోర్, జయప్రకాశ్, రవికిషన్‌ నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ఆర్దర్‌ ఎ.విల్సన్‌.
∙బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే

Advertisement
 
Advertisement
Advertisement