రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు | 'S/O Satyamurthy' strikes gold at the box office | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు

Apr 11 2015 3:40 PM | Updated on Sep 3 2017 12:10 AM

రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు

రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు

అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి రికార్డు వసూళ్లతో థియేటర్లలో హల్చల్ చేస్తోంది.

అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి రికార్డు వసూళ్లతో  థియేటర్లలో హల్చల్ చేస్తోంది. ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో  మంచి ఓపెనింగ్స్ సాధించింది. గురువారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఈ రెండురోజుల్లోనే రూ. 33.35 కోట్లు రాబట్టిందని సినీ ఎనలిస్టుల తాజా కబురు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథా చిత్రంలో సమంత, నిత్యామీనన్,  అదా శర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో ప్రధానంగా త్రివిక్రమ్ మార్క్  పంచ్ డైలాగులు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రొటీన్ కు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం రాబోయే వారం రోజుల్లో మరింత వసూళ్లను సాధించి పెద్ద హిట్గా నిలుస్తుందని అంచనా  వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement