బికినీతో రుహిసింగ్‌ రచ్చరచ్చ | Ruhi Singh with Bikini in Bongu movie | Sakshi
Sakshi News home page

బికినీతో రుహిసింగ్‌ రచ్చరచ్చ

Apr 26 2017 2:15 AM | Updated on Sep 5 2017 9:40 AM

బికినీతో రుహిసింగ్‌ రచ్చరచ్చ

బికినీతో రుహిసింగ్‌ రచ్చరచ్చ

సినిమా ల్లో పేరు ప్రతిష్ట లు పొందాలని వచ్చే భామలు నటనాపరంగా ఆకట్టుకోలేకపోయినా అందాలను ప్రదర్శించి మార్కెట్‌ను దక్కించుకుంటారు.

సినిమా ల్లో పేరు ప్రతిష్ట లు పొందాలని వచ్చే భామలు నటనాపరంగా ఆకట్టుకోలేకపోయినా అందాలను ప్రదర్శించి మార్కెట్‌ను దక్కించుకుంటారు. ఆ విధంగా క్యాలెండర్‌ గర్ల్స్‌ తమ మార్కెట్‌ పెంచుకుంటారు. ఇక ఇష్క్‌ ఫర్‌ ఎవర్‌ వంటి హిందీ చిత్రాల్లో నటించిన బ్యూటీ రుహిసింగ్‌. ఈమె చదురంగ వేట్టై హీరో నడ్డీ నటరాజన్‌ నటించిన ‘బోంగు’ చిత్రంలో నాయకిగా నటించింది. హిందీలో నటించిన చిత్రాలు ఏవీ అంతగా విజయం సాధించకపోవడంతో మార్కెట్‌లో ఇంకా వెనుకంజలోనే ఉన్న రుహిసింగ్‌ తన గుర్తింపు కోసం అప్పుడప్పుడు ఒంపుసొంపులను చూపుతూ ఫొటోలను విడుదల చేసి కలకలం సృష్టిస్తూ వస్తోంది.

ప్రస్తుతం తమిళంలో ఎంట్రీ ఇస్తున్న ఈ సుందరి మార్కెట్‌ను చేజిక్కించుకోవడం కోసం బోంగు సినిమాలోని పాటల సన్నివేశాల్లో విచ్చలవిడిగా తన అందచందాలను ఆరబోసి నటించింది. అదే సమయంలో హిందీలో తన పేరు ప్రసిద్ధి చెందడం కోసం తాజాగా ఫొటో ఆల్బమ్‌ విడుదల చేసింది. వేసవి ఎండల తాపాన్ని తగ్గించే విధంగా స్విమ్మింగ్‌పూల్‌లో తాను జలకాలాడుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్‌ చేసింది రుహిసింగ్‌. అమ్మడు విడదల చేసిన తన బికినీ ఫొటోలు కుర్రకారు నరనరాలను జివ్వున లాగేస్తూ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ రచ్చరచ్చ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement