రొమాంటిక్, ఎంటర్‌టైనర్ | Romantic, entertainer movie | Sakshi
Sakshi News home page

రొమాంటిక్, ఎంటర్‌టైనర్

Feb 17 2016 11:07 PM | Updated on Sep 3 2017 5:50 PM

రొమాంటిక్, ఎంటర్‌టైనర్

రొమాంటిక్, ఎంటర్‌టైనర్

యువతకు నచ్చే అంశాలతో పాటు రొమాం టిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కొత్త చిత్రం....

యువతకు నచ్చే అంశాలతో పాటు రొమాం టిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కాశ్యప్, చాందినీ జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. ‘డిజీక్వెస్ట్’ బసిరెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు కిశోర్ పార్థసాని క్లాప్ ఇచ్చారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘కథపై ఆరునెలలు పనిచేశాం. నటీనటులకు మూడునెలలు వర్క్‌షాప్ నిర్వహించాం. మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్నపూర్ణాస్కూల్‌లో శిక్షణ పొందిన కశ్యప్‌ను హీరోగా పరిచయం చేస్తు న్నాం. బంటిగారు మంచి పాటలు ఇచ్చారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement