ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ | RGV Suggests Arjun reddy unit show the kissing scenes to VH | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

Aug 30 2017 9:09 PM | Updated on Sep 17 2017 6:09 PM

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

అర్జున్‌ రెడ్డి సినిమాలోని ముద్దు సీన్లన్ని వీహెచ్‌కు చూపించండి.

వివాదాలు, ప్రశంసలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ అర్జున్‌ రెడ్డిపై ఫేస్‌ బుక్‌ వేదికగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీహెచ్‌ను ఉద్దేశిస్తూ మరో కామెంట్‌ చేశారు. ‘ అర్జున్‌ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్‌ టు బ్యాక్‌ కట్‌ చేసి ఒక పెన్‌ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకొని తప్పకుండా చిల్‌ అవుతారు.’ అని ఓ పోస్టు పెట్టారు. 
 
ఇక మరో పోస్టులో అర్జున్‌ రెడ్డి సినిమాను మరోసారి చూశానని, విజయ్‌ దేవర కొండ టాలీవుడ్‌ లియోనార్డో డికాప్రియో అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రశంసించారు. డికాప్రియో హాలివుడ్‌లో చేసే సినిమాల ఫార్ములానే ఈ సినిమా ఫాలో అయిందని ఆర్‌జీవీ చెప్పుకొచ్చాడు. మిగతా హీరోలు నటించే సంప్రదాయ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ని సూపర్‌ స్టార్‌ చేసిందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement