బుల్లితెరపై కూడా సూపర్‌ హిట్టే..! | Record TRP for Duvvada Jagannadham | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై కూడా సూపర్‌ హిట్టే..!

Oct 27 2017 1:27 PM | Updated on Oct 27 2017 2:19 PM

Record TRP for Duvvada Jagannadham

అ‍ల్లు అర్జున్‌ హీరోగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్‌. హరీష్‌ శంకర్‌ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాదించినా దర్శకుడు హరీష్‌ శంకర్‌​ చేసిన కొన్నివ్యాఖ్యలు  నెగెటివ్‌ పబ్లిసిటీకి కారణమయ్యాయి. ముఖ్యంగా నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ డీజే తుడిచిపెట్టేసిందంటూ చెప్పటం పై మెగా ఫ్యాన్స్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర​ 150 కన్నా డీజే కలెక్షన్లు ఎక్కువ కాదంటూ మెగా ఫ్యాన్స్‌ వాదిస్తున్నారు.

అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన  డీజే మరోసారి నాన్‌ బాహుబలి రికార్డు లన్నింటినీ తుడిచిపెట్టేసిందట. ఈ సినిమా ఏకంగా 21.78 టీర్పీతో మూడోస్తానంలో నిలిచింది. డీజే కన్నాముందు 23 రేటింగ్‌తో బాహుబలి 1,  22.7 రేటింగ్‌తో బాహుబలి 2లు ఉన్నాయి. మరి మరోసారి ఖైది రికార్డ్‌ను డీజే తుడిచేసిందన్న వార్తలపై మెగా అభిమానులు ఎలా  స్పందిస్తారోచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement