మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరట | Ready for 'Kick 3': Ravi Teja | Sakshi
Sakshi News home page

మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరట

Aug 20 2015 11:59 AM | Updated on Sep 3 2017 7:48 AM

మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరట

మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరట

మంచి కథతో రచయితలు ముందుకు వస్తే కిక్ 3 తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ చెబుతున్నాడు.

చెన్నై:   మంచి కథతో రచయితలు ముందుకు వస్తే  కిక్-3  తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు 'వ్యాపారం కోసం కాదు...నిజంగానే చక్కటి కథ, మంచి టీమ్తో ఎవరైనా తనను సంప్రదిస్తే'  కిక్ సీక్వెల్ లో నటిస్తానని మాస్ మహారాజ స్పష్టం చేశాడు. కిక్ 3 చేయడానికి  తనకు చాలా  ఉత్సాహంగా ఉందన్నాడు.  కిక్ 3 సినిమా తీస్తే  వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు.  ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి టెక్నికల్ టీమ్  కూడా కావాలని రవితేజ అభిప్రాయపడ్డాడు.     తెలుగులో కిక్ సినిమా అందించిన విజయోత్సాహంతో  దూసుకుపోతున్న ఈ మాస్ మహారాజా ఆ మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరని చెప్పకనే చెబుతున్నాడు.

కిక్  సినిమాతో  తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ...  రెండోసారి  ఆ కిక్  మజాను అందించడానికి రెడీ అవుతున్నాడు.   ఇలియానా, రవితేజ జంటగా రూపొందిన కిక్ సినిమా సీక్వెల్గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  రవితేజ, రకుల్ ప్రీత్   జంటగా నటించిన ఈ చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement