మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరట
చెన్నై: మంచి కథతో రచయితలు ముందుకు వస్తే కిక్-3 తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు 'వ్యాపారం కోసం కాదు...నిజంగానే చక్కటి కథ, మంచి టీమ్‌తో ఎవరైనా తనను సంప్రదిస్తే' కిక్ సీక్వెల్ లో నటిస్తానని మాస్ మహారాజ స్పష్టం చేశాడు. కిక్ 3 చేయడానికి తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. కిక్ 3 సినిమా తీస్తే వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు. ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కూడా కావాలని రవితేజ అభిప్రాయపడ్డాడు. తెలుగులో కిక్ సినిమా అందించిన విజయోత్సాహంతో దూసుకుపోతున్న ఈ మాస్ మహారాజా ఆ మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరని చెప్పకనే చెబుతున్నాడు.
కిక్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి ఆ కిక్ మజాను అందించడానికి రెడీ అవుతున్నాడు. ఇలియానా, రవితేజ జంటగా రూపొందిన కిక్ సినిమా సీక్వెల్‌గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.