బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే | RDX Love Movie Director Shankar Bhanu Interview | Sakshi
Sakshi News home page

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

Oct 10 2019 2:40 AM | Updated on Oct 10 2019 2:40 AM

RDX Love Movie Director Shankar Bhanu Interview - Sakshi

‘‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ కథ ఏ హీరోయిన్‌కైనా చెబితే ఫస్ట్‌ సీన్‌కే గెటవుట్‌ అంటారు. అంత బోల్డ్‌గా ఉంటుంది. ఈ కథతో కొందరి హీరోయిన్లను సంప్రదించాను. 70 రోజులు ఒక్క సినిమాకు డేట్స్‌ ఇచ్చే బదులు మూడు కమర్షియల్‌ సినిమాల్లో కనిపించవచ్చు అనేవారు. అంత వ్యాపార ధోరణిలో ఆలోచించారు’’ అని దర్శకుడు భాను శంకర్‌ అన్నారు. తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా భాను శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. సి. కల్యాణ్‌ నిర్మించారు. అక్టోబర్‌ 11న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా భాను శంకర్‌ చెప్పిన విశేషాలు.

► పక్కా వాణిజ్య అంశాలున్న చిత్రం ఇది. మెసేజ్‌తో పాటు బోల్డ్‌ కంటెంట్‌ కూడా ఉంటుంది. అది కూడా కేవలం కథలో భాగమే. యూత్‌ని టార్గెట్‌ చేయడం కోసం చేసింది కాదు. బహిరంగంగా మాట్లాడని టాపిక్‌లను ఈ సినిమాలో చూపించాం.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా రిలీజ్‌ అయిన రెండో రోజే ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్‌ను కన్‌ఫర్మ్‌ చేశాం. పాయల్‌కు కథ బాగా నచ్చి 70 రోజులు డేట్స్‌ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తను సౌందర్య, అనుష్క రేంజ్‌కు వెళ్తుంది.

► సినిమాలో ఒక పాత్ర చేస్తే నిజ జీవితంలో కూడా అలానే ఉంటామేమో అని కొందరు ఆర్టిస్టులు భయపడతారు. భయపడితే గొప్ప ఆర్టిస్టులు ఎలా అవుతారు? మా చిత్ర టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడు ‘బీ గ్రేడ్‌ సినిమానా?’ అంటూ పాయల్‌కి సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వచ్చాయి. దాంతో తను భయపడింది. ‘కామెంట్‌ చేసేవాళ్లు కేవలం టీజరే చూశారు, నీకు సినిమా మొత్తం తెలుసు కదా? నువ్వు ఎందుకు భయపడతావు?’ అని చెప్పాను.

► రొమాంటిక్‌ సినిమాకు, ‘సి’ గ్రేడ్‌ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంది. రొమాన్స్‌ పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఉంటుంది. పెద్దవాళ్లు చేస్తే ఒకలా చూసి, చిన్నవాళ్లు చేస్తే మాత్రం విమర్శిస్తారా?

► ఇప్పటికీ అభివృద్ధి చెందని గ్రామాల పరిస్థితులను మా సినిమాలో వివరించాం. అందుకు సెల్‌ సిగ్నల్‌ కూడా లేని ఒక ఊర్లోనే 45 రోజులు షూటింగ్‌ చేశాం. ఈ సినిమా విడుదల తర్వాత నెక్ట్స్‌ సినిమా ఏంటని ఆలోచిస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement