టాలీవుడ్ 'రాబిన్హుడ్' | raviteja next movie title robinhood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ 'రాబిన్హుడ్'

Jan 6 2016 9:03 AM | Updated on Sep 3 2017 3:12 PM

టాలీవుడ్ 'రాబిన్హుడ్'

టాలీవుడ్ 'రాబిన్హుడ్'

బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో ఎవడో ఒకడు సినిమాలో నటిస్తున్నాడు.

బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో 'ఎవడో ఒకడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఎవడో ఒకడు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు రవితేజ. తన మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశాడు.

కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను ఎవడో ఒకడు పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో కలెక్షన్లపరంగా పరవాలేదనిపించిన మాస్ మహరాజ్, తరువాత చేయబోయే సినిమాలతో అయినా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement