టామ్‌బాయ్‌ టైప్‌ కాదు...

Rashmika Mandanna launched Mugdha Showroom In Hyderabad - Sakshi

‘గీత గోవిందం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసారి దేవదాస్‌తో కలిసి కనిపిస్తాను’ అని చెప్పింది రష్మిక. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ముగ్ధ షోరూమ్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా రష్మిక ‘సాక్షి’తో ముచ్చటించింది.  

సాక్షి, హైదరాబాద్‌ : ‘నాకు కంచిపట్టు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగల సమయంలో పట్టు చీరలు ధరించడం బాగా అనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక వరుసగా సినిమాలు చేస్తున్నాను. నేను నటించిన దేవదాస్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. నిజానికి నాకు ఖాళీ సమయం తక్కువే’ అంటూ చెప్పిందీ బ్యూటీ. గీతగా అద్భుతమైన హావభావాలు పలికించిందని పేరు తెచ్చుకున్న రష్మిక... ‘నా కళ్లు బాగా ఎక్స్‌ప్రెసివ్‌ అని మా డైరెక్టర్‌ గారు చెప్పారు. ఓసారి నేను డైలాగ్స్‌ లేకుండా డెఫ్‌ అండ్‌ డంబ్‌ పాత్ర  చేశాను. అందుకే బాగా అలవాటై ఉంటుంది’ అంటూ నవ్వేసింది. 

నాకేం ‘సైట్‌’ లేదు..  
‘నా పాత్ర ద్వారా హీరో విజయ్‌ దేవరకొండని డామినేట్‌ చేశాననడం అస్సలు నమ్మను. నేను అలా అనుకోవడం లేదు. సినిమాలో నా పాత్రను తమకు తెలిసిన అమ్మాయిలా ప్రేక్షకులు ఫీలైతే... అది నాకు మంచి కాంప్లిమెంట్‌ అనిపిస్తుంది. కథ విన్నప్పుడు క్యారెక్టర్‌ విభిన్నంగా అనిపిస్తే తప్పకుండా.. ఆ సినిమాకు ఓకే చెబుతాను. ఆరేడు నెలల్లోనే తెలుగు బాగానే నేర్చుకోగలిగాను..’ అంటూ ఆనందం వ్యక్తం చేసిందీ అమ్మడు. ‘ఛలో సినిమా చేసిన తర్వాత నన్ను కేవలం కళ్లద్దాలు ఉంటేనే గుర్తు పట్టేవారు. ఇప్పుడు అవి లేకుండా కూడా గుర్తు పడుతున్నారు’ అంటూ నవ్వేసిన రష్మిక... తనకు కళ్లజోడు పెట్టుకోవాల్సిన పని లేదని, దృష్టి లోపం ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘అప్పుడప్పుడు టఫ్‌గా ఉంటాను. నేను నిజ జీవితంలో టామ్‌బాయ్‌ టైప్‌ కాద’ని సెలవిచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top