ఆయనతో డేటింగ్ చేస్తున్నాను | Rashmi opens up about Sidhu | Sakshi
Sakshi News home page

ఆయనతో డేటింగ్ చేస్తున్నాను

Mar 3 2016 2:49 AM | Updated on Sep 3 2017 6:51 PM

ఆయనతో డేటింగ్ చేస్తున్నాను

ఆయనతో డేటింగ్ చేస్తున్నాను

అవును ఆయనతో డేటింగ్ చేస్తున్నాను అని ధైర్యంగా వెల్లడించింది నటి రేష్మీగౌతమ్.

అవును ఆయనతో డేటింగ్ చేస్తున్నాను అని ధైర్యంగా వెల్లడించింది నటి రేష్మీగౌతమ్. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు ఆ తరువాత కనుమరుగైందనే చెప్పాలి. తెలుగులోనూ ఒకటిరెండు చిత్రాలు చేసిన రేష్మీ సహ నటీమణుల గ్లామర్ దాటికి తట్టుకోలేక, సరైన అవకాశాలు రాక చాలా మదనపడి చివరికి బుల్లితెరపై దృష్టి సారించింది. జబర్దస్త్‌లాంటి బుల్లి తెర కార్యక్రమాలతో అలరిస్తున్న రేష్మీ సినిమాల్లో రాణించాలన్న ఆశతో ఇతర హీరోయిన్లతో పోటీ పడడానికి తనూ గ్లామర్ బాట పట్టక తప్పలేదు.
 
  కురుచ దుస్తులకు, లిప్‌లాక్‌లకు, బెడ్‌రూమ్ సన్నివేశాలకు రెడీ అంటూ రంగంలోకి దిగిన ఈ అమ్మడు తాజాగా గుంటూర్ టాకీస్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అందులో హీరోగా సిద్ధుతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించిందట. ఆ సన్నివేశాల దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో సిద్ధుతో రేష్మీ ప్రేమకలాపాలు అంటూ ప్రసారాలు జోరందుకున్నాయి.
 
  సంగతి తెలిసిన రేష్మీ ఆగ్రహంతో రెచ్చిపోతుందని భావించిన వారికి ఆమె రియాక్షన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ నటి రేష్మీ స్పందన ఏమిటనుకుంటున్నారు? అవును నేను సిద్ధుతో డేటింగ్ చేస్తున్నాను. ఇది చెప్పడానికి నేనేమీ సంకోచించడంలేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, అందుకే ఆ చిత్రంలోని సన్నివేశాలలో మా మధ్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లకు మూతలు పడేలా చేసిందట. రేష్మీకి ఎంత డేర్ అంటున్నారిప్పుడు సినీవర్గాలు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement