హర్యానా హరికేన్‌ | Ranveer Singh unveils first look as Kapil Dev on birthday | Sakshi
Sakshi News home page

హర్యానా హరికేన్‌

Jul 7 2019 1:38 AM | Updated on Jul 7 2019 1:38 AM

Ranveer Singh unveils first look as Kapil Dev on birthday - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌

... అనగానే క్రికెట్‌ ప్రేమికులకు ఆల్‌ రౌండర్‌ కపిల్‌దేవ్‌ గుర్తుకు వస్తారు. కానీ రీసెంట్‌ టైమ్‌లో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు సినీ లవర్స్‌. కపిల్‌దేవ్‌ సారథ్యంలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ 1983లో ప్రపంచకప్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో సారథిగా కపిల్‌దేవ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ మధుర క్షణాలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగారు బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌. కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. శనివారం రణ్‌వీర్‌ సింగ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘1983’ హిందీ సినిమాలోని రణ్‌వీర్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే వివాహం తరవాత తొలిసారి ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు రణ్‌వీర్‌ సింగ్‌ అండ్‌ దీపికా పదుకోన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement