నవంబర్‌లో ఆ నటి వివాహం..?

Ranveer Singh And Deepika Padukone Marriage Will Be In November - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఎన్నో ఊహాగానాల నడుమ సోనమ్‌ కపూర్‌ పరిణయ ఘడియలను కూడా ప్రకటించారు. ఈ నెల 8న అనిల్‌కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి రణ్‌వీర్‌ సింగ్‌ - దీపిక పదుకోణ్‌ల వివాహం గురించే. ‘పద్మావత్‌’ సినిమా విడుదలయిన నాటి నుంచి వీరి వివాహానికి సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. దీపిక పుట్టిన రోజు నాడే వీరిరువురి నిశ్చితార్ధం అయ్యిందని, త్వరలోనే వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు గతంలో బీ టౌన్‌లో చక్కర్ల కొట్టాయి.

ఇన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి వివాహానికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో వీరిరువురు ఓ ఇంటివారు కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మధ్య ఇరు కుటుంబాలు వారు తరచు కలుసుకుంటున్నారని, రణ్‌వీర్‌ - దీపికల వివాహవేడుక గురించి చర్చించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది నవంబర్‌లో రణ్‌వీర్‌ - దీపికల వివాహం చేయ్యాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అటు దీపిక, ఆమె కుటుంబ సభ్యులుగానీ, రణ్‌వీర్‌, అతని కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

అయితే గతంలో రణ్‌వీర్‌ తన వివాహం గురించి ప్రస్తావిస్తూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరిని పిలిచి మరీ చెప్తాను అన్న సంగతి తెలిసిందే. 2017, డిసెంబరు 11న అనుష్క, విరాట్‌ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top