సంజయ్ బయోపిక్పై లేటెస్ట్ అప్డేట్ | Ranbir Says Sanjay Dutt biopic 60 per cent complete | Sakshi
Sakshi News home page

సంజయ్ బయోపిక్పై లేటెస్ట్ అప్డేట్

Apr 12 2017 2:09 PM | Updated on Sep 5 2017 8:36 AM

సంజయ్ బయోపిక్పై లేటెస్ట్ అప్డేట్

సంజయ్ బయోపిక్పై లేటెస్ట్ అప్డేట్

తన ప్రతీ సినిమాతో రికార్డులు తిరగ రాస్తున్న గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ , ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా

తన ప్రతీ సినిమాతో రికార్డులు తిరగ రాస్తున్న గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ , ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. సంజయ్ దత్ హీరోగా మున్నాభాయ్ సీరీస్ ను రూపొందించిన రాజ్ కుమార్, చాలా కాలంగా సంజయ్ బయోపిక్ ను సినిమాగా రూపొందించాలని ప్రయత్నించాడు.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న రణబీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందన్న రణబీర్, తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన విదూ వినోద్ చోప్రా, సంజయ్ దత్ లకు కృతజ్ఞతలు తెలిపాడు.

అంతేకాదు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న జగ్గా జాసూస్ వివాదం పై కూడా స్పందించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గానటించిన కత్రినా కైఫ్ సినిమా ప్రమోషన్ కు సహకరించటం లేదన్న వార్తలను రణబీర్ ఖండించాడు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా కత్రినా ప్రమోషన్ కు రావటం లేదని, ఫ్రీ అవ్వగానే పబ్లిసిటీ కార్యక్రమాల్లో కనిపిస్తుందని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement