సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిస్తా : హీరో | Ranbir Kapoor says Will pay back distributors if my movie fails | Sakshi
Sakshi News home page

సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిస్తా : హీరో

Jul 13 2017 4:18 PM | Updated on Sep 5 2017 3:57 PM

సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిస్తా : హీరో

సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిస్తా : హీరో

బాలీవుడ్ రణబీర్ కపూర్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇంత వరకు

బాలీవుడ్ రణబీర్ కపూర్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఒక్క హిట్ను కూడా అందుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. నటుడిగా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్ హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తాజాగా తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్తో కలిసి జగ్గా జాసూస్ సినిమాలో నటించాడు. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు రణబీర్.

తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్. అనుకున్నట్టుగా సినిమా విజయం సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తెలిపాడు. తన తాతాల కాలం నుంచే ఈ సాంప్రదాయం ఉందని.. నేనూ అదే కొనసాగిస్తానన్నాడు రణబీర్. 'మా తాత రాజ్ కపూర్, తండ్రి రిషీ కపూర్ కలిసి నటించిన మేరానామ్ జోకర్ సినిమా ఫ్లాప్ అయ్యింది, తరువాత వచ్చిన బాబీ ఘనవిజయం సాధించటంతో ఆ డబ్బులను మేరానామ్ జోకర్ కు నష్టపోయిన వారికి ఇచ్చారని' తెలిపాడు.  జగ్గా జాసూస్ విషయంలో తాను కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement