‘డబుల్‌’ డిమాండ్‌ చేస్తోన్న హీరో

Ranbir Kapoor Doubled His Brand Endorsement Fee - Sakshi

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వారికి వర్తించినంత బాగా వేరే ఎవరికి వర్తించదమో. ఎందుకంటే విజయాలు ఉంటేనే వారికి గుర్తింపు, ఆదాయం. అందుకే ఫామ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు హీరో హీరోయిన్లు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. ఇన్నాళ్లు వరుస వైఫల్యాలు చూసిన రణ్‌బీర్‌ కెరీర్‌ను ‘సంజు’ ఒక్కసారిగా మలుపుతిప్పింది. దాంతో ఆయన తన పారితోషికాన్ని రెండింతలు పెంచేశారంట. అయితే పారితోషికం పెంచింది సినిమాలకు కాదు, ప్రకటనల కోసం.

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

‘సంజు’ విజయం తర్వాత ఈ హీరో ప్రకటనల కోసం తీసుకునే పారితోషకాన్ని రెండు రెట్లు పెంచినట్లు సమాచారం. గతంలో రణ్‌బీర్‌ కమర్షియల్‌ వర్క్‌ కోసం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకునేవారంట. కానీ ఇప్పుడు రోజుకు రూ.6 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్‌ దాదాపు 10 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం.

‘సంజు’ తర్వాత రణ్‌బీర్‌  అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top