అతనికి ఆ స్వేచ్ఛ ఉంది! | Ranbir-Deepika's chemistry in Tamasha: Here's what Katrina thinks | Sakshi
Sakshi News home page

అతనికి ఆ స్వేచ్ఛ ఉంది!

Oct 30 2015 11:03 PM | Updated on Sep 3 2017 11:44 AM

అతనికి ఆ స్వేచ్ఛ ఉంది!

అతనికి ఆ స్వేచ్ఛ ఉంది!

ఓ వ్యక్తి మీద అతి ప్రేమ ‘పొసెసివ్‌నెస్’కి దారి తీస్తుంది. ఆ వ్యక్తి ఎవరితో కాస్తంత క్లోజ్‌గా మూవ్ అయినా భరించలేరు.

ఓ వ్యక్తి మీద అతి ప్రేమ ‘పొసెసివ్‌నెస్’కి దారి తీస్తుంది. ఆ వ్యక్తి ఎవరితో కాస్తంత క్లోజ్‌గా మూవ్ అయినా భరించలేరు. ఈ మధ్య కత్రినా కైఫ్ స్థితి అదేనని బాలీవుడ్‌లో ఓ వార్త షికారు చేస్తోంది. చాక్లెట్‌బోయ్ రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా ప్రేమలో ఉన్నారని వస్తున్న వార్తలు విదితమే. రేపో మాపో పెళ్లి చేసుకునే మూడ్‌లో ఈ జంట ఉన్నట్లు బోగట్టా. అంతా సజావుగా సాగితే మజాగానే ఉంటుంది.. కానీ, ఈ మధ్య తన మాజీ ప్రేయసి దీపికా పదుకొనేతో రణ్‌బీర్ చనువుగా ఉంటున్నారట. ఈ ఇద్దరూ ఇటీవల ‘తమాషా’ చిత్రంలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్ లొకేషన్లో ఇద్దరూ మునుపటిలా ముచ్చట్లు చెప్పుకున్నారని ఎవరో కత్రినా చెవిలో పడేశారట.

అది విన్న కత్రినా తెగ ఫీలైపోయారట. ఈ విషయం గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో కత్రినాను పాత్రికేయులు అడిగితే.. ‘‘అవునా.. నేను ఫీలయ్యానా?’’ అన్నట్లు మొహం పెట్టారు. దీపికాతో రణ్‌బీర్ క్లోజ్ ఉంటే నాకేంటి? అని కత్రినా చెబుతూ- ‘‘రణ్‌బీర్ కపూర్ ఏ హీరోయిన్‌తోనైనా వర్క్ చేయచ్చు. అతనికా స్వేచ్ఛ  ఉంది.

వాళ్లతో వర్క్ చేయి, వీళ్లతో వర్క్ చేయి.. ఆ హీరోయిన్ సరసన నటిస్తే ఊరుకునేది లేదు అని చెప్పడానికి నేనెవరిని? నేనేం డెరైక్టర్‌ను కాను కదా? అయినా ఓ సినిమాలో  హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న వాళ్ల మధ్య ఏదో ఉందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నేను కూడా సినిమా నటినే. నేనూ ఎంతోమంది హీరోల సరసన నటిస్తున్నాను. ఎవరితో నటిస్తే వాళ్లతో ఎఫైర్ ఉన్నట్లా? అలా అనుకోవడం ఎంతవరకూ సమంజసం’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement