వర్మ రాక్షసుడిగా మారక ముందు..! | ramgopla varma tweet | Sakshi
Sakshi News home page

వర్మ రాక్షసుడిగా మారక ముందు..!

Apr 26 2017 1:44 PM | Updated on Sep 5 2017 9:46 AM

వర్మ రాక్షసుడిగా మారక ముందు..!

వర్మ రాక్షసుడిగా మారక ముందు..!

సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ట్వీట్ల తో ఎంటర్టైన్ చేసే రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికమైన ట్వీట్ చేశాడు. చాలా ఏళ్ల కిందట

సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ట్వీట్ల తో ఎంటర్టైన్ చేసే రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికమైన ట్వీట్ చేశాడు. చాలా ఏళ్ల కిందట తన కూతుర్ని ఒళ్లో కూర్చోపెట్టుకొని దిగిన ఫోటోను ట్వీట్ చేసిన వర్మ నా గత జన్మలో అంటూ ట్వీట్ చేశాడు. తరువాత అదే ఫోటోను మరోసారి పోస్ట్ చేసి 'రాక్షసుడిగా మారకముందు, నా మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫోటో ఇది' అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం అమితాబ్ లీడ్ రోల్ తెరకెక్కుతున్న సర్కార్ 3 పనుల్లో బిజీగా ఉన్న వర్మ, మే 12న ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సర్కార్ తో ఎలాగైన సక్సెస్ సాధించాలన్న కసితో ఉన్న వర్మ షూటింగ్ అంతా పూర్తయిన తరువాత కూడా సినిమాకు రిపేర్లు చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పలువురు బాలీవుడ్ ప్రముఖులకు అమితాబ్ సన్నిహితులకు సినిమా చూపించి మార్పులు చేర్పులు చేస్తున్నాడట. మరి మారిన వర్మ తీసిన సర్కార్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement