పవన్.. ఆ తప్పు చేయొద్దు: వర్మ | ramgopal varma advises pawan not to release sgs in hindi | Sakshi
Sakshi News home page

పవన్.. ఆ తప్పు చేయొద్దు: వర్మ

Mar 19 2016 1:50 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్.. ఆ తప్పు చేయొద్దు: వర్మ - Sakshi

పవన్.. ఆ తప్పు చేయొద్దు: వర్మ

ఎప్పుడూ తన సినిమాలతో పాటు వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తన మార్కు సెటైర్లు వేశాడు.

ఎప్పుడూ తన సినిమాలతో పాటు వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తన మార్కు సెటైర్లు వేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్  సినిమాను హిందీలో విడుదల చేయడం సూపర్ డూపర్ తప్పు అవుతుందని అన్నాడు. బాహుబలి స్థాయిలో విజువల్స్ స్థాయి ఉంటే తప్ప ఆ సినిమాను హిందీలో విడుదల చేయొద్దని సలహా ఇచ్చాడు.

జాతీయస్థాయిలో పవన్ కల్యాణ్ కంటే ప్రభాస్ ఎక్కువన్న విషయం సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో హిందీ బాక్సాఫీసులో రుజువైతే, అది అతడికి చాలా దారుణం అవుతుందని చెప్పాడు. పవన్ కల్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లలో నిజమైన వ్యక్తి, తెలివైన వ్యక్తి కనీసం ఒక్కరు ఉన్నా కూడా.. హిమాలయాలంత స్థాయి తప్పు చేయొద్దని అతడికి సలహా ఇవ్వాలని కోరాడు.  తన సినిమా కూడా బాహుబలి అంత పెద్దదైతేనే పీకే హిందీలోకి రావాలని, కానీ బాహుబలితో పోల్చి చూసినపుడు.. పవన్ కల్యాణ్ లేకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చాలా చిన్నగా కనపడుతుందని చెప్పాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement