ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..! | Ram Vunnadhi Okate Zindagi First single | Sakshi
Sakshi News home page

ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!

Aug 6 2017 10:10 AM | Updated on Sep 17 2017 5:14 PM

ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!

ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డేకు ఒక్కరోజు ముందు రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement