నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు . ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ రిలీజ్ ను కూడా తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశాడు రామ్.
This one is going to be Super Fresh!!! #VOZ First Look! NEXT- #TrendMarinaFriendMaradu single Out Tomorrow at 10AM!!! #VunnadhiOkateZindagi pic.twitter.com/WJxCvz2Bz7
— Ram Pothineni (@ramsayz) 5 August 2017