మళ్లీ మాట తప్పిన వర్మ

Ram Gopal Varma on twitter again - Sakshi

ఓ మాట చెప్పటం.. మాట మీద నిలబడకపోవటం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటు. గతంలో ఇలాగే మాటలు చెప్పిన మాట తప్పిన సందర్భాలు వర్మ కెరీర్ లో చాలానే ఉన్నాయి. తాజా మరోసారి తన మార్క్ చూపించాడు వర్మ. 2017 మే 27 ఇక ట్విట్టర్ కు గుడ్ బై అంటూ ప్రకటించి తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

తాను డిస్ట్రబ్ చేస్తున్న వ్యక్తులు తానకు బోర్ కొట్టారని అందుకే ఇక ఎవరినీ ట్వీట్లతో ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. అందుకే ట్విట్టర్ అకౌంట్ క‍్లోజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. అయితే మరోసారి మాట తప్పిన వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ను తిరిగి ప్రారంభించాడు. కాసేపటి క్రితమే (2018 జనవరి 2 మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో) వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు.

మరోసారి తాను ట్విట్టర్ లోకి అడుగుపెడుతున్నట్టుగా ట్వీట్ చేసిన వర్మ, పవన్ మీద దాడి ప్రారంభించాడు. ‘ట్విట్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిన నేను పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో ఇన్స్‌పైర్‌ అయ్యి మళ్లీ వచ్చా’ అంటూ ట్వీట్ చేశాడు. తన రెండవ ట్వీట్ ను రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి చేసిన వర్మ ఈ సారి ఎవరిని టార్గెట్ చేస్తాడోచూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top