'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో' | Ram gopal Varma Comments on Baahubali 2 trailer youtube views | Sakshi
Sakshi News home page

'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో'

Mar 17 2017 1:41 PM | Updated on Jul 14 2019 4:05 PM

'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో' - Sakshi

'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో'

ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మరోసారి తన ట్వీట్లకు పని చెప్పాడు. ముందుగా ఈ ట్రైలర్ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ,

ఎప్పుడూ ఎవరినో ఒకర్ని టార్గెట్ చేసి వివాదాస్పద ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పీడు పెంచాడు. గురువారం బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మరోసారి తన ట్వీట్లకు పని చెప్పాడు. ముందుగా ఈ ట్రైలర్ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ, రాజమౌళితో పాటు ఇతర యూనిట్ సభ్యులపై ప్రశంసల వర్షం కరిపించాడు. అదే సమయంలో టాలీవుడ్ టాప్ స్టార్లను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో విమర్శలు చేశాడు. తాజాగా బాహుబలి 2 ట్రైలర్ 50 మిలియన్ల( 5 కోట్ల) వ్యూస్ సాధించిన సందర్భంగా 'ఈ ఫిగర్ని చూసి టాలీవుడ్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

గురువారం ఉదయం రిలీజ్ చేసిన బాహుబలి ట్రైలర్ 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్కు పైగా సాధించింది. ఈ ఘనత సాదించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావటం విశేషం. ఇప్పటికే బాహుబలి రెండో భాగం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలు మరింత పెంచేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అందుకే రెండో భాగం రిలీజ్కు వారం రోజుల ముందు బాహుబలి తొలి భాగాన్ని మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన బాహుబలి రీ రిలీజ్లో మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement