నేపాల్కు తెలుగు హీరో సహాయం | Ram Charan to send relief material to Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్కు తెలుగు హీరో సహాయం

Apr 29 2015 12:53 PM | Updated on Jul 14 2019 1:57 PM

నేపాల్కు తెలుగు హీరో సహాయం - Sakshi

నేపాల్కు తెలుగు హీరో సహాయం

నేపాల్కు తనవంతు సహాయం అందించేందుకు ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ముందుకొచ్చారు.

చెన్నై: నేపాల్కు తనవంతు సహాయం అందించేందుకు ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ముందుకొచ్చారు. ఆయన అపోలో ఆస్పత్రి సహాయంతో నేపాల్కు సాయమందించనున్నారు. నేపాల్ కు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మొదటివారు. 'ఆపోలో ఆస్పత్రి సహాయంతో సినీనటుడు రామ్ చరణ్ తేజ  నేపాల్ భూకంప బాధితులకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు టానిక్లు పంపించనున్నారు' అని ఆయన మీడియా కార్యదర్శి తెలిపారు. కాగా, రామ్ చరణ్తోపాటు ఆయన తండ్రి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కూడా నేపాల్ సహాయం అందించేందుకు జతకట్టనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం షూటింగ్తో రామ్ చరణ్ తీరిక లేకుండా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement