రియల్ మెగాస్టార్‌ని కలిశా

చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకానుంది. తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రామ్‌చరణ్ ‘‘సైరా’ చిత్రం కోసం నాన్నగారు చాలా పరివర్తన చెందటం అద్భుతం.
ఆ కష్టంలో మంచి అనుభవం దాగి ఉంది. నాన్నగారి సినిమాలకు నిర్మాతగా మారిన తర్వాత నేను రియల్ మెగాస్టార్‌ని కలిశాననిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. ‘సైరా’ చిత్రంలో నయనతార కథా నాయికగా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలక పాత్రధారులు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రామ్‌చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘సైరా’ చిత్రం చరణ్‌కు నిర్మాతగా రెండోది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి