
మహేష్ గొప్ప నటుడు : రామ్ చరణ్
తొలిసారిగా తన అభిమానుల కోసం లైవ్ చాట్ చేసిన యంగ్ హీరో రామ్ చరణ్, పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించాడు. ఇగోలను పక్కన పెట్టి ఈ జనరేషన్ హీరోలపై పాజిటివ్ కామెంట్స్తో...
తొలిసారిగా తన అభిమానుల కోసం లైవ్ చాట్ చేసిన యంగ్ హీరో రామ్ చరణ్, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇగోలను పక్కన పెట్టి ఈ జనరేషన్ హీరోలపై పాజిటివ్ కామెంట్స్తో మెప్పించాడు. ముఖ్యంగా మహేష్ బాబుపై అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..' మహేష్ బాబు గొప్ప నటుడు, అందగాడు, మంచి వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తనకు మంచి స్నేహితుడని తెలిపాడు.
ప్రస్తుతం చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చరణ్, తన తండ్రి చిరంజీవి హీరోగా తను నిర్మిస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదని, ప్రస్తుతం ఆ సినిమా టైటిల్ కత్తిలాంటోడు అని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని తెలిపాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.