చెర్రీ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌

Ram Charan Boyapati Movie Release Date Announced - Sakshi

టాలీవుడ్‌ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో ఓ ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చెర్రీ కెరీర్‌లో ఇది 12వ చిత్రం కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మేజర్‌ అనౌన్స్‌మెంట్‌ చేసేశారు. 

2019 సంక్రాంతి పండగకి ఈ చిత్రం విడుదల కాబోతుందని ప్రకటించారు. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక​ ఒబేరాయ్‌ విలన్‌ రోల్‌లో నటిస్తుండగా, తమిళ నటుడు ప్రశాంత్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ దాకా చిత్రం షూటింగ్‌ కొనసాగనుంది. 

తొలుత ఈ చిత్రం దసరాకే రిలీజ్‌ అవుతుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ మారింది. బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఎన్టీఆర్‌ చిత్రం కూడా సంక్రాంతి సమయంలోనే విడుదల కానుంది. దీంతో చెర్రీ-బాలయ్య చిత్రాలతో ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top