ఎస్‌ రకుల్‌ ఫిక్స్‌ | Rakul Preet Singh on board for Sivakarthikeyan's next | Sakshi
Sakshi News home page

ఎస్‌ రకుల్‌ ఫిక్స్‌

Mar 25 2018 4:50 AM | Updated on Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh on board for Sivakarthikeyan's next - Sakshi

శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌

తమిళసినిమా: నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ జోరు దక్షిణాదిలో కాస్త తగ్గిందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ అమ్మడిప్పుడు బాలీవుడ్‌పై దృష్టి సారిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో రాకరాక ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంతో ఒక్క విజయం వచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా ఎన్‌జీకే చిత్రంలో నటిస్తోంది. ఇక కార్తీతో మరో చిత్రంలో నటించనుంది. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో జతకట్టనుందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ విషయాన్ని నిర్మాత అధికారికంగా వెల్లడించారు. శివకార్తికేయన్‌ తాజాగా పొన్‌రామ్‌ దర్శకత్వంలో సీమదురై చిత్రంలో నటిస్తున్నారు సమంత నాయకి. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

దీంతో తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని 24 ఏఎం.స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మించనున్నారు. నేట్రు ఇండ్రు నాళై చిత్రం ఫేమ్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించనున్న ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించనున్నట్లు నిర్మాత అధికారికపూర్వకంగా వెల్లడించారు. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలను కట్టనున్నారు. అదే విధంగా నీరవ్‌షా చాయాగ్రహణం అందించనున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ బాధ్యతలను ముత్తురాజ్‌ నిర్వహించనున్నట్లు నిర్మాత శుక్రవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద రకుల్‌ కోలీవుడ్‌లో బిజీ అవుతోందన్న మాట.

           శివకార్తికేయన్, ఏఆర్‌.రెహ్మాన్, దర్శకుడు రవికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement