రెహమాన్‌ వెనుక ఎవరైనా ఉన్నారా?.. కోటి షాకింగ్‌ కామెంట్స్‌! | Music Director Interesting Comments On AR Rahman | Sakshi
Sakshi News home page

రెహమాన్‌ వెనుక ఎవరైనా ఉన్నారా?.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి షాకింగ్‌ కామెంట్స్‌!

Jan 23 2026 3:27 PM | Updated on Jan 23 2026 3:42 PM

Music Director Interesting Comments On AR Rahman

మతం వల్లే తనకు అవకాశాలు తగ్గాయంటూ  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఎంత దుమారం రేపాయో తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసిన రెహమాన్‌.. ఇలా మాట్లాడడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ఆయన వివరణ ఇచ్చినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు. తాజాగా రెహమాన్‌ వివాదంపై ఆయన గురువు, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) స్పందించారు. రెహమాన్‌ లాంటి వ్యక్తి అలా మాట్లాడడం చాలా బాధగా ఉందని అ‍న్నారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ మెయిల్‌ కూడా చేస్తానని చెప్పారు.

తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రెహమాన్‌ చాలా మంచి మనసున్న వ్యక్తి. బాలీవుడ్‌ చరిత్రనే మార్చిన వ్యక్తికి అవకాశాలు రాకపోవడం ఏంటి? అయినా రెహమాన్‌కి బాలీవుడ్‌ అనేది చిన్న తునుపు ముక్క. ఆయన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం..అది కూడా పరాయి దేశం మీడియాలో చెప్పడం..చాలా బాధగా ఉంది. అసలు రెహమాన్‌ ఎప్పుడు ఇలా మాట్లాడడు. సంగీతం తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడుతుంటాడు. 

సంగీత కచెరీలో లక్షలాది మంది అభిమానుల గట్టి గట్టిగా అరుస్తున్నా..వారితో కూల్‌గా మాట్లాడి.. పాటలు అందించేవాడు. అసలు ఆ వ్యాఖ్యలు చేసింది రెహమానేనా? లేదా ఆయన వెనుక వేరే వ్యక్తులు ఉండి..అలా మాట్లాడించారా? అనే అనుమానం నాకు ఉంది. ఏదేమైనా రెహమాన్‌ చాలా పెద్ద తప్పు చేశాడు. వెంటనే క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టమని మెయిల్‌ చేస్తా. ఆయన నా మాట వింటాడో లేదో తెలియదు కానీ.. తనకు మంచి జరగాలని, ఆయన మీద పడ్డ మచ్చ త్వరలోగా చెరిగిపోవాలని ఆ అల్లాని, భగవంతున్ని కోరుకుంటున్నా’ అని కోటి అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement