టాప్‌ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్‌! | Rajkumar Hirani Reportedly Accused Of Harassments | Sakshi
Sakshi News home page

హిరానీ టూ?

Jan 14 2019 2:53 AM | Updated on Jan 14 2019 12:53 PM

Rajkumar Hirani Reportedly Accused Of Harassments - Sakshi

రాజ్‌ కుమార్‌ హిరానీ

‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను.

మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్‌ మేకింగ్‌ పార్ట్‌నర్‌ విదూ వినోద్‌ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా,  రచయిత అభిజిత్‌ జోషీకు మెయిల్‌ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్‌ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే.

Advertisement
 
Advertisement
Advertisement