ఫుల్‌ ప్రొటక్షన్‌

Rajinikanth's Petta stills leaked, security beefed on sets - Sakshi

పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్‌ రజనీకాంత్‌కు ప్రొటక్షన్‌గా ఉన్నారు. ఇది సినిమాలోని సీన్‌ కాదండీ బాబు. రియల్‌ సీన్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది. ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్‌ చిన్నది కాదు. దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్‌లోనే ప్రధాన తారాగణంతో పాటు సుమారు 500 మంది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్‌బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్‌ అవుతున్నాయని సెట్‌లోకి సెల్‌ ఫోన్స్‌ను నిషేధించారట టీమ్‌. సూపర్‌ స్టార్‌కి ఫుల్‌ ప్రొటక్షన్‌ ఏర్పాటు చేశారట.. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుందని కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top